వయసు పైబడినా యవ్వనంగానే కనిపించాలన్న కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.దాదాపు అందరికీ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే చర్మం కోసం రకరకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.తరచూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ పేరుతో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.
అయినప్పటికీ ఎంతోకొంత వయసు పైబడిన లక్షణాలు కనిపిస్తుంటాయి.కానీ, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే నలబైలోనూ మీ ముఖం యవ్వంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మజ్జిగ, రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు వేసుకుని రెండు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పును మజ్జిగతో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని.దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, చిటికెడు ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారంలో మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నిస్తే.వయసు పెరిగినా ముఖం యవ్వనంగా మెరుస్తుంది.వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా.వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కాబట్టి, ఈ సింపుల్ రెమెడీని తప్పకుండా ట్రై చేసేందుకు ప్రయత్నించండి.