సెన్సార్ పూర్తిచేసుకున్న ధృవ కిరోసిన్ మూవీ

డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు.ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

 Unique Crime Thriller ‘kerosene’ Awarded With U/a Certificate , Dhruva, Brah-TeluguStop.com

సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ధృవ.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.కాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది.

ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.

ఇకపోతే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.

ఈ వేడిలో చూపించిన అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.ఓ యూనిట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం చేశాయి.

అలాగే కిరోసిన్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి.

ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube