సింగపూర్ : పెళ్లి పేరిట మోసం ... వరుడికి, వరుడి తండ్రికి టోకరా, భారత సంతతి మహిళకు జైలు

మ్యాట్రిమోని వెబ్‌సైట్ల నుంచి వచ్చే ఫేక్‌ కాల్స్‌ కారణంగా మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దీని నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు.తాజాగా మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్‌లో యువతిగా మాయమాటలు చెప్పి.

 51-year-old Indian Woman Jailed In Singapore For Duping Man On Matchmaking Websi-TeluguStop.com

భారతీయుడిని, అతని తండ్రిని 5,000 సింగపూర్ డాలర్లకు పైగా మోసం చేసిన 51 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు మంగళవారం ఏడు నెలల జైలు శిక్ష విధించింది.ఒక తమిళ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో కీర్తనా అనే 25 ఏళ్ల మహిళగా నిందితురాలు మలిహా రాము నకిలీ ప్రొఫైల్‌ను పోస్ట్ చేసినట్లు టుడే వార్తాపత్రిక కథనాన్ని ప్రసారం చేసింది.
ఇందుకోసం మలీహా తన బంధువుల ఫోటోలను ఉపయోగించింది.తాను విదేశాల్లోని ఆర్మీ బేస్‌లో పనిచేస్తున్నానని, కెమెరా ఫోన్‌ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని చెప్పి వీడియో కాల్‌లకు దూరంగా వుండేది.

ఈ క్రమంలో మంగళవారం మలీహా రెండు చీటింగ్ ఆరోపణలపై నేరాన్ని అంగీకరించింది.ఇప్పటికే 2006, 2007 సంవత్సరాల్లో చేసిన ఇదే తరహా నేరాలకు ఆమె 15 ఏళ్ల క్రితం జైలు శిక్ష అనుభవించింది.

భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన బాధితులతో స్నేహం చేసిన మలీహా వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి 2,25,000 సింగపూర్ డాలర్ల మేర వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో 2018లో బాధితుడు గోవింద ధనశేఖరన్ మురళీకృష్ణకు పెళ్లి చేయాలని అతని తండ్రి మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్‌లో ఖాతాను తెరిచారు.

దీంతో ధనశేఖరన్ వెబ్‌సైట్‌లోని నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగా.తన ఇంటి నెంబర్‌కు కాల్ చేసి తన తల్లితో మాట్లాడమని చెప్పింది.

అయితే మలీహా తల్లి 2002లోనే మరణించింది.దీంతో కీర్తనగా, కీర్తన తల్లిగా నిందితురాలే నటించింది.

Telugu Matrimony, Profile, Singaore, Singapore-Telugu NRI

అప్పటి నుంచి కీర్తన వలె నటిస్తూ.మలీహా వాట్సాప్ టెక్ట్స్, కాల్స్ ద్వారా గోవింద ధనశేఖరన్‌తో మాట్లాడేది.2019లో తన ఉద్యోగ ఒప్పందం ముగియనుందని.ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పుడు తాను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పింది.

తీరా ఆ రోజు రాగానే.తన కాంట్రాక్ట్‌ను మరో మూడు నెలలు పొడిగించామని ఆమె అబద్ధాలు చెప్పేది.

తన తల్లి అనారోగ్యంతో వుందని.తన సోదరుడితో కలిసి అమెరికాలో వున్నారని, అందుకే వారితో పెళ్లి గురించి చర్చించలేకపోయానని కప్పిపుచ్చేలా మాట్లాడింది.

ఇదే సమయంలో సోషల్ వర్క్ క్లయింట్‌లకు సహాయం చేయడానికి తనకు కొంత నగదు అవసరమని చెప్పి గోవింద ధనశేఖరన్‌ని డబ్బు అడిగింది.దీంతో ఆయన డిసెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు నాలుగు విడతలలో 4,750 సింగపూర్ డాలర్లు నగదు బదిలీ చేశాడు.

అలాగే అతని తండ్రి నుంచి కూడా 1,000 సింగపూర్ డాలర్లను నిందితురాలు తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube