తెలుగు బుల్లితెరపై నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో అందరినీ ఎంతగానో సందడి చేసే సుమ ఎల్లప్పుడూ ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు.
అయితే తాజాగా సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సుమ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.బుల్లి తెరపై ఎప్పుడూ నవ్వుతూ అందరినీ సందడి చేసే సుమ కోపం ఎంతో కఠినంగా ఉంటుందని తెలిపారు.
తాను ఇంట్లో ఏ విషయం గురించి అయినా గొడవపడితే కోపం ప్రదర్శించిన నా కోపం క్షణికావేశం మాత్రమేనని తెలిపారు.అయితే సుమకు కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటుంది.
ఏకంగా ఇంట్లో వాళ్ళతో రెండు మూడు రోజులపాటు మాట్లాడటం మానేస్తుందని, ఈ సందర్భంగా రాజీవ్ వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమ మధ్య ఉన్న గొడవల గురించి కూడా ఆయన స్పందించారు.
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న గొడవలు మాదిరే తమకు గొడవలు ఉన్నాయని అయితే అవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ సహజమేనని తెలిపారు.

ఇకపోతే సుమ ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు ఫ్రీ రిలీజ్ వేడుకలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.బుల్లితెరపై అందరినీ సందడి చేసిన సుమ జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేదని చెప్పాలి.







