గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి అస్సలు బాలేదనే సంగతి తెలిసిందే.పెద్ద హీరోల సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నా అదే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచగా పెరిగిన టికెట్ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి.పెరిగిన టికెట్ రేట్లతో సినిమాలను చూడలేమని పరోక్షంగా ప్రేక్షకులు తేల్చి చెబుతున్నారు.
సాధారణ టికెట్ రేట్లతో విడుదలైన నాని అంటే సుందరానికి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా టాక్ కు ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదనే సంగతి తెలిసిందే.మేజర్ సినిమాలా ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లను తగ్గించి ఉంటే ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యి ఉండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే రానా మాత్రం తన సినిమా విషయంలో ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారనే సంగతి తెలిసిందే.
రానా విరాటపర్వం సినిమాకు 150, 200 టికెట్ రేట్లుగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
ఈ టికెట్ రేట్ల వల్ల విరాటపర్వం సినిమాకు బెనిఫిట్ కలుగుతుందేమో చూడాల్సి ఉంది.విరాటపర్వం సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కించారు.
అయితే కరోనా వల్ల రిలీజ్ డేట్ మారడంతో ఈ సినిమా నిర్మాతపై భారం ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.వేణు ఊడుగుల తొలి సినిమా నీదీనాదీ ఒకే కథ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.విరాటపర్వం సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన బాధ్యత దర్శకునిపై ఉంది.







