యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు భారీ సినిమాలు ఉన్నాయి.
ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చాడు.కానీ ఈ సినిమా ప్రభాస్ అభిమానులను బాగా నిరాశ పరిచింది.
ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ లో కూడా నటిస్తున్నాడు.అలాగే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాల విషయం అలా ఉంచితే ప్రభాస్ లుక్ విషయంలో గత కొన్ని రోజులుగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇతడి లుక్ అసలు బాలేదని ప్రభాస్ ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టడం లేదని ఆయన లుక్ పూర్తిగా చేంజ్ అయిపోయిందని పలువురు ట్రోల్స్ చేసారు.ఆదిపురుష్ షూట్ సమయంలో ఈయనపై బాగా విమర్శలు వచ్చాయి.
ఇక డార్లింగ్ ఫ్యాన్స్ సైతం అయన ఫిట్ నెస్ మీద ద్రుష్టి పెడితే బాగుటుంది అని కోరుకున్నారు.

మరి ఇప్పుడు వైరల్ అయినా పిక్ చూస్తుంటే ప్రభాస్ ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టినట్టుగానే అనిపిస్తుంది.ప్రెసెంట్ సలార్ షూట్ లో ఉన్న ప్రభాస్ లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో డార్లింగ్ చాలా ఫిట్ గా అయ్యి కనిపిస్తున్నాడు.
అలాగే ముఖంలో కూడా గ్లో కనిపిస్తుంది.ఈ ఫొటోలో ఈయన చెక్ షర్ట్ వేసుకుని తలకు కాప్ పెట్టుకుని స్టైల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
ఈ ఫోటో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.







