ఏ హీరోకైనా కెరీర్ ఎక్కువకాలం పాటు కొనసాగాలంటే మాస్ ఇమేజ్ ముఖ్యమనే సంగతి తెలిసిందే.క్లాస్ సినిమాలకే పరిమితమైతే కొంతకాలం విజయాలు దక్కినా దీర్ఘకాలంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.
యంగ్ జనరేషన్ హీరోలలో చాలామంది హీరోలు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.యూత్ సినిమాలకే పరిమితమైతే ఇబ్బందులు తప్పవని భావించి హీరోలు మాస్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు.
స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి ఈ హీరోలు ప్రయత్నిస్తున్నారు.వరుస సక్సెస్ లతో జోరుమీదున్న రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు.
మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ ఊరమాస్ రోల్ లో నటిస్తున్నారు.

రామ్ బాటలో నడుస్తూ మాస్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న హీరోలలో నితిన్ ఒకరు.ఈ హీరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నారు.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.నితిన్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో కూడా నితిన్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.నాగచైతన్య కూడా ప్రస్తుతం మాస్ ఇమేజ్ ను కోరుకుంటున్నారు.పరశురామ్, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సినిమాలకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి చైతన్యకు మాస్ ఇమేజ్ ను అందిస్తాయేమో చూడాలి.
టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరోలు చాలామందే ఉన్నారు.







