సింగర్ కార్తీక్.. సొంత కష్టంతో పైకి వచ్చాడంటూ నాటి విషయాలు చెప్పిన తమన్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సింగర్ కార్తీక్ గురించి అందరికి తెలిసిందే.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా దీన్ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ అతి తక్కువ కాలంలోనే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Thaman On Singer Karthik At Telugu Indian Idol Press Meet Details, Thaman, Indi-TeluguStop.com

ఇకపోతే సింగర్ కార్తీక్ మీద వచ్చిన ఆరోపణల గురించి మనందరికీ తెలిసిందే.మీటూ ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సింగర్ కార్తీక్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సింగర్ కార్తీక్ చాలా మంది యువ గాయనిల పేర్లు కూడా బయట పెట్టేసాడు.అవకాశాల పేరిట మోసం చేశాడని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇక సింగర్ చిన్మయి సైతం కార్తిక్‌ను టార్గెట్ చేసింది.తనతో ఎన్నడూ అలా ప్రవర్తించలేదు గానీ.ఆ అమ్మాయిలకు మాత్రం న్యాయం జరగాలంటూ చిన్మయి డిమాండ్ చేస్తూ వచ్చేది.ఇకపోతే సింగర్ కార్తీక్ కోసం ఎంతో మంది రాయబారం కూడా చేశారు అంటూ చిన్మయి ఆ మధ్య ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత కార్తిక్ చాలా రోజుల పాటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చాడు.మళ్లీ ఇన్ని రోజుల తరువాత జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆహాలోని పాటల ప్రోగ్రాంకు జడ్జ్‌గా వచ్చాడు.

తెలుగు ఇండియన్ ఐడల్ షోకు కార్తిక్ జడ్జ్‌గా ఉండటంపై కూడా చిన్మయి కౌంటర్లు వేసింది.ఇక పోతే ఈ షో మరికొద్ది రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే.

Telugu Indian Idol, Press Meet, Chinmayi, Singerkarthik, Thaman, Thaman Karthik,

ఈ వారం షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భాగంగా తమన్ మాట్లాడుతూ.కార్తీక్ 8 వేల పాటలు పాడారని, అవి బయటకు వచ్చనవి మాత్రమే 40 వేల స్క్రాచెస్ లక్షకుపైగా ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటారు అని తెలిపాడు తమన్.గత 22 ఏళ్లుగా మేము స్నేహితులను.

బాయ్స్ సినిమా వచ్చినప్పటి నుంచీ మాకు పరిచయం ఉంది.కార్తీక్ ఎవరి సహాయం లేకుండా తన కష్టంతోనే పైకి వచ్చారు.

తనకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు అమ్మానాన్నలు కూడా ఇండస్ట్రీకి చెందినవారు కాదు అంటూ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించారు తమన్.మరి ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube