దేశంలో బాలయ్యకు మాత్రమే సొంతమైన ఈ రికార్డుల గురించి మీకు తెలుసా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు.

 Star Hero Balakrishna Narasimha Naidu Movie Rare Records Details Here , Balakr-TeluguStop.com

బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ నాయుడు సినిమా కూడా ఒకటి.బాలయ్య హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001 సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

టైటిల్ తోనే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి.

నరసింహనాయుడు తర్వాత బాలయ్య బి.గోపాల్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఊహించగా ఫ్యాన్స్ అంచనాలు నిజమయ్యాయి.ఈ సినిమాకు పోటీగా మృగరాజు, దేవీపుత్రుడు సినిమాలు విడుదలైనా పైచేయి సాధించిన సినిమా మాత్రం బాలయ్య సినిమానే కావడం గమనార్హం.

అయితే ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకుంది.

ఏలూరులోని అంబికా కాంప్లెక్స్ లోని రెండు థియేటర్లలో ఈ సినిమా వారం రోజుల్లో 101 షోలు ప్రదర్శితమైంది.కలెక్టర్ నుంచి అదనపు షోలకు అనుమతులు లభించడంతో ఈ సినిమా రోజుకు ఏడు, ఎనిమిది షోలు ప్రదర్శించబడి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

దేశంలోనే ఈ అరుదైన రికార్డ్ బాలయ్యకు మాత్రమే సొంతమని సమాచారం అందుతోంది.

Telugu Gopal, Balakrishna, Simha, Rare-Movie

కర్నూలు జిల్లాలో ఒకే ప్రింట్ తో కోడుమూరు, గూడూరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న సినిమా నరసింహ నాయుడు కావడం గమనార్హం.సినిమా ఇండస్ట్రీలో మరే హీరోకు లేని ఈ అరుదైన ఘనత బాలయ్య బాబుకు సొంతమైంది.నరసింహ నాయుడు సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేయగా ఆ రికార్డులలో చాలా రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube