యశ్ తో జోడి కడుతున్న పూజా హెగ్డే..!

కె.జి.ఎఫ్ పార్ట్ 2 తో కూడా ఆశించిన స్థాయిలో అదరగొట్టిన హీరో యశ్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. కె.జి.ఎఫ్ ముందు వరకు అతను కేవలం కన్నడ హీరో మాత్రమే ఆఫ్టర్ కె.జి.ఎఫ్ 1,2 రిలీజ్ ఇప్పుడు అతనొక పాన్ ఇండియా హీరో.యశ్ సినిమాల కోసం నేషనల్ లెవల్ లో ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.ఈ క్రమంలో యశ్ తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.కన్నడ స్టార్ డైరక్టర్ నర్తన్ డైరక్షన్ లో యశ్ సినిమా తెరకెక్కనుంది.ఆల్రెడీ అక్కడ మర్ఫీ సినిమా తీసి సత్తా చాటిన ఈ డైరక్టర్ యశ్ తో మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

 Pooja Hegde Is Heroine For Yash Movie Yash, Pooja Hegdhe , Kgf 2-TeluguStop.com

ఈ సినిమాను కె.వి.ఎన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తుంది.ఇక ఈ మూవీలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దేని తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఈమధ్య పాన్ ఇండియా సినిమాలకు ఆమె పర్ఫెక్ట్ ఆప్షన్ అయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేరకమైన క్రేజ్ తో అమ్మడు సత్తా చాటుతుంది.

అంతేకాదు పూజా హెగ్దే సినిమాలో ఉంటే స్పెషల్ ఎట్రాక్షన్ అన్నట్టే.అందుకే పూజా హెగ్దే ని యశ్ కి జోడీగా ఫిక్స్ చేశారట.

ఈ సినిమా కోసం అమ్మడు ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube