లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విగ్నేష్ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉంటూ ఎట్టకేలకు నేడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట వీరి ప్రేమలో విహరిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఈ విధంగా వీరు ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి విషయం గురించి ఏ మాత్రం క్లారిటీ ఇవ్వని ఈ జంట ఎట్టకేలకు నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ నయనతార విగ్నేష్ హిందూ సాంప్రదాయాల ప్రకారం తమిళనాడులోని మహాబలిపురం పుణ్యక్షేత్రంలో నేడు తెల్లవారుజామున 2.22 నిమిషాలకు వీరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే వీరి వివాహం అనంతరం దర్శకుడు విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.మీ అందరి ప్రేమ ఆప్యాయతలు అనురాగం నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చాయి.
మీ ప్రేమకు రుణపడి ఉంటాను.నా జీవితంలో ప్రేమ అంతా నయనతారకే అంకితం.
అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ విగ్నేష్ తన ప్రేయసి, భార్య నయనతార పై ఉన్న ప్రేమను ఈ విధంగా బయటపెట్టారు.

నా ప్రియమైన కుటుంబం, అత్యంత సన్నిహితుల నడుమ తన జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించానని ఈ సందర్భంగా విగ్నేష్ నయనతారతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







