ఉస్తాద్ రామ్ పోతినేని చేతుల మీదుగా సిద్ శ్రీరామ్ పాడిన ‘ఒక పథకం ప్రకారం’ ఓసారిలిరా లిరికల్ సాంగ్‌...

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం.ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు.

 Osarilira Lyrical Song 'oka Padhakam Prakaram' Sung By Sid Shriram Over The Hand-TeluguStop.com

ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు.విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది.

ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్.తాజాగా ఈ చిత్రంలోని ఓసారిలిరా లిరికల్ సాంగ్‌ను ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేసారు.

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది.

ఓసారిలిరా.

ఓసారిలా.
కుడికాలు మోపి గుడిలోకి రా.
ఓసారిలిరా.ఓసారిలా.
విరహాలు తీరా.ఒడిలోకి రా.

ఊగాలిలా ఉయ్యాలలా.నీతో ఇలా జతగా.

అంటూ అందమైన లిరిక్స్ అందించారు రెహమాన్.ఇప్పటికే రవితేజ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌లో సినిమా కాన్సెప్టును చూపించారు మేకర్స్.

ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్.పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది.

ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు.దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు.

ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube