టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఎంత క్రేజ్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.
ఇక ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్స్ కూడా కుమ్మేసింది.
ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఒక వైపు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందట.ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.ఇటీవలే వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నాడు అనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఈ విషయంపై నాని అంటే సుందరానికి ప్రొమోషన్స్ లో స్పందించారు.

ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అలాంటిది ఏమీ లేదని సింపుల్ గా జవాబు ఇచ్చాడు నాని.
అంతేకాదు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఏ విషయం అయినా నేను అధికారికంగా చెబుతానని తెలిపాడు.ఈయన కామెంట్స్ తో ఈ సినిమా లేదని అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.
మరి నిజంగానే మరో హీరో ఉన్నాడా లేదంటే వస్తున్నా వార్తలు అన్నీ రూమర్స్ నేనా అని ముందు ముందు తెలియాల్సి ఉంది.







