పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనస్సు మంచి మనస్సు అని ఆయనతో పని చేసిన వాళ్లు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు.సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును దాచుకోకుండా సహాయం అవసరమైన వాళ్లకు సహాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.
అయితే చాలామంది హీరోలు చిన్న సహాయం చేసినా వాటి గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడతారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చేసిన సహాయాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.
ప్రముఖ నటుడు సమ్మెట గాంధీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ గొప్పదనం గురించి వెల్లడించగా ఆయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అత్తారింటికి దారేది మూవీ షూటింగ్ సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ మా అమ్మాయి పెళ్లి అని పవన్ కళ్యాణ్ కు కార్డ్ ఇచ్చారని సమ్మెట గాంధీ చెప్పుకొచ్చారు.
ఆ జూనియర్ ఆర్టిస్ట్ ను సాయంత్రం ఒకసారి కనపడాలని పవన్ కళ్యాణ్ చెప్పారని సాయంత్రం వెళ్లి ఆ జూనియర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ను కలవగా లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.తుఫానులు వచ్చిన సమయంలో పవన్ కోట్ల రూపాయలు సాయం చేశారని ఆయన తెలిపారు.
పవన్ లో ఉండే దాన గుణం మామూలు దాన గుణం కాదని ఆయన కామెంట్లు చేశారు.

పవన్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లు అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.
పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.







