స్టార్ హీరోయిన్ కాజల్ మంచి ఫాం లో ఉన్న టైం లోనే తన లవర్ గౌతం కిచ్లుని ప్రేమించి పెళ్లాడింది.మ్యారేజ్ అయ్యి ఏడాది గడిచిందో లేదో వాళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు.
కాజల్ ఇప్పుడు తన టైం మొత్తం తన బాబుతోనే గడుపుతున్నట్టు తెలుస్తుంది.అయితే మొన్నటిదాకా స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ ఇలా సడెన్ గా సినిమాలు మానేస్తే ఎలా చెప్పండి.
అందుకే ఆమె ఫ్యాన్స్ ఆమెని మళ్లీ సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో కాజల్ కూడా తన భర్త గౌతం ని ఒప్పించి సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట.
కాజల్ తిరిగి సినిమా అవకాశాల కోసం చూస్తుంది.అందుకే లేటెస్ట్ ఫోటో షూట్ తో మళ్లీ తన మునుపటి లుక్ తో కనిపిస్తుంది.అయితే ఈసారి కమర్షియల్ సినిమాల్లో కాకుండా ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని అనుకుంటుందట కాజల్.అంతేకాదు వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని డిసైడ్ అయ్యిందట.
ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాల మీద అమ్మడు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.మరి కాజల్ కు అలాంటి ఛాన్సులు వస్తాయా లేదా అన్నది చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటించినా సరే ఆమె పాత్రని చివరి నిమిషంలో లేపేశారు.ఇండియన్ 2 కమిట్ అయినా అది కూడా మధ్యలో ఆగిపోయింది.
అందుకే ఫ్రెష్ గా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ ని అలరించాలని అనుకుంటుంది కాజల్.







