ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఆ సినిమాలో కనిపించిన జోడీ సూపర్ హిట్ అని ప్రేక్షకులు వారిపై మరింత ఆసక్తి చూపిస్తారు.వారు ఆ జోడీ మళ్ళీ కలిసి నటిస్తే బాగుండు అని కోరుకుంటారు.
మరి ఇలాంటి సూపర్ హిట్ జోడీలు ప్రతి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.మరి అలాంటి జోడీనే రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జోడీ.వీరిద్దరూ కలిసి రోబో సినిమాలో నటించారు.
2010లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.రిలీజ్ అయినా అన్ని భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఈ సినిమాలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది.మరి అలాంటి హిట్ జోడీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మళ్ళీ ఇది సాధ్యం అవుతుంది అని ఎవ్వరు అనుకోలేదు.కానీ ఇది సాధ్యం అవుతుంది.వీరి జోడీని తెరమీద చూసేందుకు ఎదురు చూసే ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించ బోతున్నాయి.రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ సినిమాలోనే రజనీకాంత్ జోడీగా ఐశ్వర్య రాయ్ నటించనుంది.ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీంతో మరోసారి ఈ జంటను తెరమీద చూసేందుకు ఈగర్ గా వైట్ చేస్తున్నారు అభిమానులు.
ఇక ఇందులో కీలక పాత్రలో రమ్య కృష్ణ నటించనుంది.అలాగే ఇంకో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా కనిపించనున్నట్టు టాక్.







