దుస్తులు కొనడానికి డబ్బులు లేకపోతే ఆ హీరో సాయం చేశారు.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఉండడమే కాకుండా బుల్లితెర పై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ విధంగా వరుస సినిమాలు వరుస టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సల్మాన్ ఖాన్ తాజాగా జూన్‌ 3, 4 తేదీల్లో దుబాయ్‌లో జరిగిన ‘ఐఫా’ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 Suniel Shetty Gifted Me Clothes When I Did Not Have Enough Money To Spare Says S-TeluguStop.com

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పలు చేదు సంఘటనలు గురించి ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సునీల్ శెట్టి అంటే తనకు ఎంతో అభిమానమని తనని అన్నయ్యగా భావిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మేమిద్దరం కలిసి దుస్తులు కొనడానికి షాప్ కి వెళ్ళాము.అయితే అప్పట్లో ట్రెండింగ్ గా ఉన్నటువంటి దుస్తులను కొనడానికి నా దగ్గర సరిపోయే డబ్బులు లేవు.

దాంతో బట్టలు కొనలేక బాధగా వచ్చేసాను.

Telugu Bollywood, Gift, Salman Khan, Suniel Shetty-Movie

నేను ఈ విధంగా బట్టలు కొనలేక బాధపడిన విషయాన్ని గుర్తించిన సునీల్ శెట్టి నా కోసం దుస్తులను కొన్నారని ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ఈ విధంగా సునీల్ శెట్టి నాకెంతో ఇష్టమైన ట్రెండీ జీన్స్‌, షర్ట్‌, బూట్లు, పర్స్ ఉన్న ఆ సెట్ మొత్తం బహుమతిగా ఇచ్చారని సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అదేవిధంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తనకు బోనికపూర్ సినిమా అవకాశాలు ఇచ్చి తనకు ఎంతో సహాయం చేశారని ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube