న్యాయం జరగాలంటూ రోడ్డెక్కిన యాంకర్ రష్మీ.. సుధీర్ వెళ్లిపోవడంతో?

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా, టీవీ రంగాలలో ఎదగడం సులువైన విషయం కాదు.అయితే సుడిగాలి సుధీర్ మాత్రం తన టాలెంట్ తో ఊహించని స్థాయిలో టీవీ రంగంలో పేరు తెచ్చుకున్నారు.

 Rashmi Gautam Comments About Sudigali Sudheer Goes Viral In Social Media Rashmi-TeluguStop.com

ఈటీవీలో సుడిగాలి సుధీర్ వల్లే హిట్టైన టీవీ షోలు, ఈవెంట్లు ఉన్నాయి.అయితే వరుసగా ఈటీవీ షోల నుంచి తప్పుకుంటూ సుధీర్ అభిమానులకు ఒకింత షాకిచ్చారు.

సుధీర్ ఈ షోల నుంచి తప్పుకోలేదని వాళ్లే పంపించారని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

సుధీర్ రష్మీ జోడీ బుల్లితెర జోడీలలో ఒకటి కాగా ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న మరో బుల్లితెర జోడీ లేదనే సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీకి న్యాయం జరగాలంటూ స్కిట్ చేశారు.జరగాలి జరగాలి నాకు న్యాయం జరగాలి అని రష్మీ చెప్పగా ఇమ్మాన్యుయేల్ వెరైటీగా నేనప్పుడే చెప్పాను వద్దురా మనకు లవ్ సింబల్ లు అని రష్మీ సుధీర్ జోడీపై పంచ్ వేశారు.

ఇమ్మాన్యుయేల్ కామెంట్ విని రష్మీ మొహం మాడ్చుకున్నారు.

నీకో విషయం తెలుసా నేను టాయిలెట్ వస్తే ఎక్కడికి వెళతానో తెలుసా మా బాత్ రూమ్ కే అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేస్తారు.ఇమ్మాన్యుయేల్ తన రెగ్యులర్ స్టైల్ లో కాకుండా కొత్తగా వేసిన పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఆ తర్వాత మరో స్కిట్ లో కళావతి గెటప్ లో వర్ష దర్శనమిచ్చారు.

నాకు చదువుకోవడానికి 10 లక్షల రూపాయలు లోన్ కావాలని వర్ష అడగగా బుల్లెట్ భాస్కర్ లోన్ ఇస్తాడు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ వర్షను డబ్బులు అడగగా 10 లక్షల రూపాయలతో ఇమ్మాన్యుయేల్ ను పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతుంది.10 లక్షలకు 11 లక్షలు తీసుకోవాలని చెబుతాడు.ఇమ్మాన్యుయేల్ బుల్లెట్ భాస్కర్ ను బ్రో అని పిలవగా వీడు బ్రో అన్న ప్రతిసారి లక్ష రూపాయలు పెంచాలని బుల్లెట్ భాస్కర్ చెబుతాడు.

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube