అమెరికాలో ఇలాంటివారికి కొదువలేదు, వారే రేపటి ఆవిష్కర్తలు: ఆనంద్‌ మహీంద్రా

ఆనంద్‌ మహీంద్రా.పరిచయం అక్కర్లేని పేరు.

 There Is No Such Thing In America, They Are Tomorrow's Innovators: Anand Mahindr-TeluguStop.com

ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందించడం, ప్రతిభ కలిగినవారిని ప్రత్సాహించడం అనేది ఆనంద్‌ మహీంద్రా వీధిలో భాగంగా పెట్టుకుంటారు.నిత్యం సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వున్న ఈయనికి ఏమాత్రం అవకాశం చిక్కినా, ఏ చిన్న ఆవిష్కరణలు చేసేవారినైనా ప్రమోట్ చేయడానికి వెనుకాడరు.

ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా.పల్లెల్లో దాగున్న ప్రతిభను సైతం అతను గుర్తిస్తారు.

ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద మార్పులకు దారి తీస్తాయంటారు ఆనంద్‌ మహీంద్రా.

ఈ క్రమంలో ఆనంద్‌ మహీంద్రా తన సోషల్ మీడియా వేదికగా తాజాగా ఓ వీడియోను షేర్‌ చేసారు.

ఇందులో ఒక కూల్‌డ్రింక్‌ బాటిల్‌, ఒక పొడవైన కర్ర, కొంత దారం సాయంతో చెట్టు చిటారు కొమ్మన ఉన్న పళ్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎంతో చాకచక్యంగా, సురక్షితంగా కోసే పరికరం తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి.ఆ వీడియోలో దృశ్యాలు ఈ దేశ సామాన్య పౌరుల ప్రతిభకు ప్రతీగా కనిపిస్తాయి.

ఆ పరికరం అది పని చేసే తీరు చూసి అబ్బుర పడిన ఆనంద్‌ మహీంద్రా వెంటనే తన అభిప్రాయలను ట్విటర్‌లో పంచుకున్నారు.

ఆనంద్‌ మహీంద్రా సదరు వీడియోని పోస్ట్ చేస్తూ, “ఇదేమీ బ్రహ్మాండం బద్దలయ్యేంత ఆవిష్కరణ కాదు.కానీ కొత్తగా ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.అందుకే ఈ వీడియో పట్ల నేను ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నాను.

ఇలాంటి వారి వల్లే అమెరికా ఈ రోజు గొప్ప దేశంగా నిలిచింది.ఇలాంటి అలవాటు వల్లే అమెరికన్స్‌ తమ ఇంట్లో ఉన్న గ్యారేజీల్లో బేసేమెంట్లలో ఎన్నో సరికొత్త అంశాలను కనిపెట్టారు.

ఇలాంటి ఆలోచనాపరులే రేపటి భారీ ఆవిష్కర్తలు!” అంటూ ఆనంద్‌ మహీంద్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube