కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పాండవగల్లు గ్రామం మరియు పెద్ద తుంబలం గ్రామం లో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో పలు దేవాలయాలకు అభివృద్ధి ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించడం జరిగింది.అనంతరం ఈ రోజు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నిధులు కేటాయించినా దేవాలయాలకు ఈరోజు వారు పర్యవేక్షించి అనంతరం పాండవగల్లు వెలిసిన ఆంజనేయస్వామి దేవాలయం నందు 30 లక్షలు విరాళంగా ఇచ్చారు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా మరియు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా కమిటీ హాల్ ను ప్రారంభించారు.
అనంతరం పెద్ద తుంబలం శ్రీ రామ దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు.టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పాండవగల్లు గ్రామానికి మరియు పెద్ద తుంబలం గ్రామానికి పురాతన దేవాలయం కు రూ.1 కోటి 20 లక్షలు దేవాలయాల అభివృద్ధి కొరకు మంజూరు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్ మరియు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.







