యజమాని ప్రమాదంలో ఉన్నాడని ఈ కుక్క ఏం చేసిందో చూస్తే ఫిదా..!

కుక్కలు యజమానులకు తమ విశ్వసనీయతను రుజువు చేసిన సందర్భాలెన్నో.యజమాని ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదని పాములతో పోరాడిన కుక్కలు గురించి మీరు వినే ఉంటారు.

 Fida If You Look At What This Dog Did That The Owner Was In Danger , Viral Lates-TeluguStop.com

ప్రాణాలను త్యాగం చేసిన కుక్కల సంఘటనలు గురించి ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు.వేల సంవత్సరాలుగా మానవులకి మంచి స్నేహితులుగా మెలుగుతున్న ఈ కుక్కలు అన్ని విషయాల్లోనూ సహాయ పడుతుంటాయి.

ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అంటే తమ ప్రాణాలు గురించి ఆలోచించకుండా పోరాడతాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతోంది.ఈ వీడియో ని పూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.“ఈ కుక్క నిజంగా భయపడినప్పటికీ తన యజమానిని రక్షించడానికి వెళ్లింది” అని ఈ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియోకి ఇప్పటికే కోటి వ్యూస్, మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి వ్యాక్యూమ్ క్లీనర్ తో ఫ్లోర్ శుభ్రం చేయడం చూడొచ్చు.

అతని ముందే ఒక జర్మన్ షెఫర్డ్ కుక్క నిల్చొని చూస్తోంది.అయితే అతడు తన కుక్క విశ్వసనీయతను పరీక్షించాలి అనుకున్నాడు.అందుకే వ్యాక్యూమ్ క్లీనర్ పైపు లాగేసి దానిని తన ఛాతీపై పెట్టుకుని ఏదో షాక్ వచ్చినట్టుగా గజగజా వణికిపోయాడు.ఈ దృశ్యం చూసి కుక్క బాగా భయపడి పోయింది.

తన యజమానికి ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందింది.తమ యజమాని ప్రాణాలను ఆ పైపు తీసేస్తుందేమో అని దానిని గట్టిగా కరిచింది.

మరో ఆలోచన లేకుండా తన యజమాని ప్రాణాలు దక్కితే చాలు తన ప్రాణాలు పోయినా పర్లేదు అని ఇది ముందుకొచ్చింది.ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మరొక వ్యక్తి వీడియో రికార్డు చేశారు.ఈ వీడియో చూసిన యానిమల్స్ లవర్స్ ఫిదా అవుతున్నారు.

“యజమాని తన ప్రాంక్ ఆపేసిన తర్వాత కూడా కుక్క అక్కడే నిల్చొని ఏదైనా అయితే మళ్లీ కాపాడాలని సిద్ధంగా ఉంది.యజమాని ప్రాణాల కోసం కుక్కలు ఎంతటి రిస్క్ అయినా చేస్తాయి” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.“విశ్వసనీయతకు కుక్కలు మారుపేరు” అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు.ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube