మీకు తెలుసా... ఆదిపురుష్ తెలుగు సినిమా కాదట

మూడు సంవత్సరాల పాటు ప్రభాస్ అభిమానులు ఎదురు చూసిన రాధేశ్యామ్‌ ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది.రాధేశ్యామ్‌ ఒక వర్గం వారికి నచ్చినా కూడా ఓవరాల్‌ గా సినిమా ప్లాప్ అని తేలిపోయింది.

 Prabhas Aadipurush Movie Not A Telugu Movie Prabhas, Aadipurush, Kriti Sanon, B-TeluguStop.com

వసూళ్ల విషయంలో మరీ దారుణమైన నెంబర్స్ నమోదు అయ్యాయి.దాంతో ప్రభాస్ అభిమానులు తదుపరి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అంటూ ఆది పురుష్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకు ఇటీవలే వచ్చే ఏడాది జనవరి లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా నెలలు అయ్యింది.

ప్రస్తుతం మోషన్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.సినిమాలో ప్రభాస్ తో పాటు పలు పాత్రలను పది అడుగుల ఎత్తు ఉండే ఆజాను బాహుబలు గా చూపించబోతున్నారట.

ఇక ఈ సినిమా ను ప్రభాస్ అభిమానులు తెలుగు సినిమా అనుకుంటున్నారు.కాని తెలుగు లో ఒక్క షాట్ కూడా తీయలేదట.

పూర్తి గా హిందీ లోనే సినిమా ను తీయడం జరిగిందట.పూర్తిగా హిందీ టెక్నీషియన్స్ నటీ నటులతో ఆది పురుష్‌ రూపొందింది.

ఒక్క ప్రభాస్ తప్ప ఆదిపురుష్‌ లో పూర్తి గా బాలీవుడ్‌ మెటీరియల్‌ ఉంటుందట.కనుక ఆది పురుష్ అనేది తెలుగు సినిమా సౌత్‌ సినిమా పాన్ ఇండియా సినిమా కాదని.

ఒక పక్కా బాలీవుడ్‌ సినిమా అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.హీరోగా ప్రభాస్ ఆదిపురుష్ తో పూర్తి స్థాయి బాలీవుడ్‌ హీరో గా మారబోతున్నాడు.

కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను రామాయణం ఇతి వృత్తంతో రూపొందించినా కూడా ఇది ఒక రామాయణం కథ కాదు అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.సినిమా ను దాదాపుగా 500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube