యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇంత పగా.. ఈ హీరోపై కావాలనే కక్షగట్టారా?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటాడో మనందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి ఏదైనా సినిమాకు కమిట్ అయ్యారు అంటే ఆ సినిమా పట్ల అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండడం అన్నది కూడా అతని సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు.

 So Much Revenge On Young Tiger Ntr Tollywood, Ntr, Revenge, Jr Ntr, Rrr , Ram Ch-TeluguStop.com

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఊహించని విధంగా స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ పై ఎప్పటికప్పుడు పెయిడ్ దుష్ప్రచారం జరుగుతూనే ఉంటుంది.ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వారి మధ్య ఉన్న స్నేహాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు.

అయినప్పటికీ వారిద్దరి స్నేహాన్ని చెడగొట్టేందుకు చాలా చాలా ప్రయత్నాలు మీడియా పరంగా కూడా జరిగాయి.ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యాక కూడా అదే నెగెటివిటీ యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద జరుగుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవడానికి ఇంకాస్త సమయం పడుతుంది.

ఈలోగా యంగ్ టైగర్, తన ఫిజిక్ మీద ఫోకస్ పెడుతున్నాడు.అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం పార్టీల్లో మునిగి తేలుతున్నాడనీ, అర్థ రాత్రి వరకూ తప్పతాగి చిందులేస్తున్నాడనీ, స్నేహితుల కోసం కెరీర్‌ని రిస్క్ చేసేస్తున్నాడనీ ఎన్టీయార్ పేరు చెప్పకుండానే అతని మీద గాసిప్స్ ప్రచారం చేసేస్తున్నారు కొందరు.

Telugu Jr Ntr, Koratala Shiva, Ntr Carrer, Raja Mouli, Ram Charan, Revenge, Toll

ఇదంతా ఎవరు చేయిస్తున్నారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కి కొంతమంది ముఖ్యమైన స్నేహితులున్నారు.స్నేహితుల్ని ఎన్టీఆర్ బాగా ట్రీట్ చేస్తాడు.అలాగని, ఎన్టీయార్ కెరీర్‌ని పణంగా పెట్టేంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడా.? ఎన్టీయార్ ఫిజిక్ ఈ పార్టీల కారణంగా పాడైపోతుందనీ, ఎన్టీయార్ తదుపరి చిత్ర నిర్మాత ఈ విషయమై ఆందోళన చెందుతున్నాడనీ.ఎన్టీయార్‌ కెరీర్‌ని దెబ్బతీసేలా గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube