తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచిన గొప్పవ్యక్తిగా నందమూరి తారక రామారావుకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పాలి.కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
అయితే నందమూరి తారకరామారావు సినిమానే ఊపిరిగా బ్రతికే వారు అన్న విషయం తెలిసిందే.సినిమాల విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో నిర్ణయం తీసుకునే వారు.
ఈ క్రమంలోనే ఇక ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక సినిమాలోని సన్నివేశం విషయంలో సెన్సార్ బోర్డు సభ్యుల కు వ్యతిరేకంగా ఏకంగా మూడేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు నందమూరి తారక రామారావు.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నటసార్వభౌముడు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన సినిమా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర. ఇక ఇదే సినిమాలో వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యుడు అయిన సిద్దప్ప పాత్రలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించారు.
సిద్దయ్య పాత్ర కు హీరోయిన్ కి మధ్య జరిగే సంభాషణలు హిందువులు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశాన్ని కత్తిరించేశారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ సన్నివేశం సినిమాలు ఉండాల్సిందే అంటూ పట్టుబట్టారు.అందులో తప్పేమీ లేదని ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సంభాషణలు లేవు అంటూ.ఆ సన్నివేశం సినిమాలో పెట్టేందుకు మూడేళ్లపాటు న్యాయపోరాటం చేశారు.
ఆ తర్వాత కేసు గెలిచారు.ఇక ఆ సన్నివేశాన్ని కత్తిరించకుండానే సినిమాలో పెట్టి సినిమాను విడుదల చేశారు.ఇక ఇలా ఒక సన్నివేశం కోసం ఎన్టీఆర్ మూడేళ్ల పాటు న్యాయ పోరాటం చేయడం మాత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లోనే సంచలనంగా మారిపోయింది.1984 నవంబర్ 29వ తేదీన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.







