ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మధ్య, సినీ అభిమానుల మధ్య సినిమా టికెట్ రేట్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.సినిమా టికెట్ రేట్లు పెంచడం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి పెద్ద సినిమాలకు ప్లస్ కాగా సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్లే ఆచార్య, రాధేశ్యామ్, మరికొన్ని సినిమాలకు కలెక్షన్లు తగ్గాయని చాలామంది భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే టికెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఎఫ్3 సినిమాకు దిల్ రాజు టికెట్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.
టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ఎఫ్3 సినిమాకు ప్లస్ అయింది.వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కడంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే ఇన్నిరోజులు టికెట్ రేట్లు పెంచాలని నాయకులను, ప్రభుత్వ అధికారులను కలిసిన నిర్మాతలు ఇప్పుడు మాత్రం పాత టికెట్ రేట్లకే టికెట్లను అమ్ముతున్నాం అంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీ సీఎం జగన్ ను రిక్వెస్ట్ చేసి టికెట్ రేట్లను భారీగా పెంచుకోవడం వల్ల ఇండస్ట్రీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.టికెట్ రేట్లను పెంచుకున్నా ఫస్ట్ వీకెండ్ వరకు పెంపును పరిమితం చేసి ఉంటే బాగుండేది.

తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల టికెట్ రేట్ల గురించి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.దిల్ రాజు, ఇతర ప్రొడ్యూసర్లు టికెట్ రేట్లను తగ్గించడంపై సీఎం జగన్, పేర్ని నాని నవ్వుకొని ఉంటారని వర్మ అన్నారు.నిర్మాతల నిర్ణయాలను చూసి జగన్, పేర్ని నాని డ్యాన్స్ లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.







