కియారా అద్వానీ, ఆమె బాయ్ ఫ్రెండ్ ను వెంటపడి వేధిస్తున్న కేఆర్కే!

వివాదాస్పద క్రిటిక్ కేఆర్కే గురించి తెలిసిందే అయితే ఇతను గతంలో కూడా సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రభాస్ వంటి హీరో లపై తీవ్ర విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

 Krk On Sidharth Malhotra And Kiara Advani,krk, Siddarth Malhotra, Kiara Advani,-TeluguStop.com

కేఆర్కే ఇటీవల తన జీవిత చరిత్రను వివాదాస్పద KRK పేరుతో విడుదల చేసిన విషయం.ఈ ఘనతకు గాను బాలీవుడ్ సంజయ్ దత్ పాటుగా పలువురు ప్రముఖులు అతడిని అభినందించారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా అతన్ని అభినందించ బోయి అడ్డంగా బుక్కయింది.

కేఆర్కే ఆగ్రహానికి లోనయ్యింది కియారా.

కేఆర్కే జీవిత చరిత్రకు అభినందనలు తెలుపుతూ కియరా ట్వీట్ చేయగా.దానిని తొలగించేలా ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేరేపించాడని కమల్ ఆర్ ఖాన్ తాజాగా ఆరోపించారు.

సిద్ధార్థ్ ను మ్యాన్ అప్ చేయమని కేఆర్కే అడిగాడట.ఈ విషయంలో సిద్ధార్థ్ కియారాపై కోపంగా ఉన్నాడని ఆరోపించాడు.

అభినందనలు అని రాసిన కియారా తొలగించిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ కేఆర్కే ఇలా రాసాడు.నటి #కియరా అద్వాణీ ఈ ట్వీట్ చేసి 10 నిమిషాల తర్వాత తొలగించారు.

కేఆర్కే ఆమెను కారణం అడిగినప్పుడు? సిద్ధార్థ్ మల్హోత్రా ఆ ట్వీట్ ని తొలగించాలని కోపంగా తనని అడిగినట్టు వెల్లడించారు అని తెలిపాడు కేఆర్కే.చెప్పుతే సిద్ధార్థ్, కియారా గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వారి ప్రేమ వ్యవహారాన్ని మాత్రం వారు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.అంతేకాకుండా ఇటీవలే వారిద్దరి లవ్ బ్రేకప్ అయ్యింది అని ప్రచారాలు కొనసాగినప్పటికీ, తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలకు జంటగా కార్లో కనిపించారు సిద్ధార్థ్, కియారా.

Telugu Bollywood, Kiara Advani, Prabhas, Karan Johar-Movie

ఇకపోతే కేఆర్కేకి సిద్ధార్థ్ ఒక శత్రువు.అందుకే అతడిపై కేఆర్కే ఎదురు దాడికి వెనకాడరు.ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.ఇంతకుముందు కూడా ఆలియా భట్ పై కేఆర్కే అవమానకరమైన వ్యాఖ్యను పాస్ చేయగా మల్హోత్రా దానిపై ఆరోపించడంతో ఇద్దరి నడుమా మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఈ జంట విషయంలో కేఆర్కే సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో జంటను వెంటపడి వేధిస్తున్న కేఆర్కే అంటూ ఇప్పుడు నెటిజనుల్లో చర్చ సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube