ఓటిటిలో కూడా దుమ్ములేపేస్తున్న ఆర్ఆర్ఆర్.. 10 రోజుల్లోనే 1000 మిలియన్ మార్క్!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Rrr Clocks 1000 Million Streaming Minutes On Zee5 Ott Platform, Rrr, Rrr Ott -TeluguStop.com

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.

Telugu Rajamouli, Ram Charan, Rrrminutes, Rrr Ott, Rrr Zee, Zee-Movie

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటిటి లో స్ట్రీమింగ్ చేసారు.ఈ నెల 20 నుండి ట్రిపుల్ సినిమా జీ5 వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది.ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసినా కూడా ప్రేక్షకుల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం పోలేదు.

దీంతో ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుంది.ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రసారం అవుతుంది.ఇక 10 రోజుల్లోనే ఎవ్వరి అంచనాలను తగ్గకుండా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.అన్ని భాషల్లో కలిపి ట్రిపుల్ ఆర్ సినిమా 10 రోజుల్లోనే 1000 మిలియన్ స్ట్రీమింగ్ నిముషాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది.

ఈ రికార్డ్ చూసిన తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.మన సినిమా ఇలాంటి సంచలనాలు నమోదు చేయడం తో మరోసారి తెలుగు సత్తా ఈ సినిమా రుజువు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube