రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం సినిమా కోసం దాదాపుగా రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఒక వర్గం ప్రేక్షకులు ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జులై 1వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ముందుగానే మంచి సమయం దొరకడంతో జూన్ 17వ తారీకున సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఈమద్య కాలంలో సినిమాల వాయిదాల వార్తలే చూశాం.కాని మొదటి సారి సినిమా ముందే రాబోతున్నట్లుగా ప్రకటన రావడం ఆనందంగా ఉందంటూ సాయి పల్లవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు మరియు విరాట పర్వం సినిమా టైటిల్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి.
జాతీయ స్తాయి లో సినిమా యొక్క చర్చ జరిగింది.
విరాట పర్వం సినిమా లో ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతుంది.సాయి పల్లవి విప్లవ భావాలు కలిగిన యువతి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
సినిమా లో రానా హీరోగా నటించినా కూడా సాయి పల్లవి గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.అదుగో ఇదుగో అంటూ సాయి పల్లవి అభిమానులను ఊరించిన వేణు ఉడుగుల ఎట్టకేలకు మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
భారీ ఎత్తున ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విరాట పర్వం సినిమా ను థియేటర్ లోనే విడుదల చేస్తున్నారు. సాయి పల్లవి నటించిన సినిమా అవ్వడంతో విరాట పర్వం ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు మలయాళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సురేష్ బాబు ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామిగా ఉన్నాడు.ఆయనే సినిమా ముందస్తుగా విడుదల కావాలనే వ్యూహంతో ముందుకు వచ్చారు.







