నాని తో జెర్సీ సినిమా ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ సినిమా షూటింగ్ అదుగో ప్రారంభం.
ఇదిగో ప్రకటన అంటూ గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు.ఈ సమయంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ జెర్సీ సినిమా నిరాశ పర్చింది.
సినిమా కు టాక్ బాగానే ఉంది.రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి.
కాని వసూళ్లు మాత్రం తీవ్రంగా నిరాశ పర్చాయి.దాంతో రామ్ చరణ్ మరియు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అసలు ఏం జరగబోతుంది అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.రామ్ చరణ్ కు గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో సినిమా చేయడం పై ఆసక్తి ఉంది.కాని ఆయన చెప్పిన కథ విషయంలోనే కాస్త వెనకడుగు తప్పడం లేదు అంటున్నారు.రామ్ చరణ్ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబో సినిమా క్యాన్సిల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో వార్తలు పుట్టించే ప్రయత్నం చేశారు.
వెంటనే వాటికి యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు.ఈ ఏడాది చివర్లో రామ్ చరణ్, శంకర్ మూవీ పూర్తి అవుతుంది.
ఆ వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కు రామ్ చరణ్ డేట్లు ఇస్తాడు.

వెంటనే తాము సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.క్రీడా నేపథ్యంలోనే మరో సినిమా ను గౌతమ్ తిన్ననూరి తీయబోతున్నాడు.రామ్ చరణ్ ను ఏ ఆట ప్లేయర్ గా గౌతమ్ చూపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సెప్టెంబర్ వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారట.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
ఈ ఏడాదిలోనే చరణ్, గౌతమ్ ల సినిమా ప్రారంభం అయితే ఖచ్చితంగా వచ్చే ఏడాదిలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.







