సలార్ క్లైమాక్స్ మొత్తం సముద్రంలోనే.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఆడియెన్స్ లో ఎంత క్రేజ్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన కనిపిస్తే చాలు అభిమానులు సర్వం మర్చి పోతారు.

 Pan India Star Prabhas Salaar Movie Latest Update Details, Prabhas, Salaar, Pras-TeluguStop.com

అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.సాహో సినిమా మన దగ్గర విజయం సాధించక పోయిన బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

అయితే ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.

ఇలా ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభాస్ ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

గత సినిమాల పరాభవాన్ని మర్చిపోయేలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ అంతా కూడా సముద్రం లోనే జరుగుతుందని టాక్.

Telugu Salaar, Panindia, Prabhas, Prashanth Neel, Radheshyam, Shruti Haasan-Movi

అంతేకాదు సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ మరొక రేంజ్ లో ఉండబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇలా రోజుకొక వార్త వస్తూ డార్లింగ్ అభిమానులను మరింత ఊరిస్తుంది.అందుకే ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే ట్రాక్ కూడా ఎమోషనల్ గా ఉంటుందట.మొత్తానికి కేజిఎఫ్ను మించిన విజయం కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube