చిరంజీవితో కలిసి నటిస్తే హీరోయిన్ కు పెళ్లి ఫిక్స్.. తమన్నాకు కూడా అంటూ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.రీఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో ఆచార్య మినహా మిగిలిన రెండు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.

 Chiranjeevi Marriage Sentiment For Star Heroines Details Here Goes Viral , Chira-TeluguStop.com

గాడ్ ఫాదర్ షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసిన చిరంజీవి తర్వాత సినిమాల షూటింగ్ లను కూడా వేగంగా పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది.అయితే సోషల్ మీడియాలో చిరంజీవి, ఆయనతో నటించే హీరోయిన్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆచార్య సినిమాలో, ఖైదీ నంబర్ 150 సినిమాలలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆచార్య సినిమాలో కాజల్ నటించిన సీన్లను తొలగించి సినిమాను విడుదల చేశారు.

అయితే ఆచార్య షూటింగ్ సమయంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది.మరో స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు.

నయనతారకు కూడా పెళ్లి ఫిక్స్ అయింది.చిరంజీవితో కలిసి నటిస్తున్న సమయంలోనే హీరోయిన్లకు పెళ్లి ఫిక్స్ అవుతుండటం గమనార్హం.

భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈమెకు కూడా త్వరలో పెళ్లి ఫిక్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి తమన్నా కూడా పెళ్లి చేసుకుని శుభవార్త చెబుతారేమో చూడాలి.

Telugu Chiranjeevi, Kajal Agarwal, Nayanatara, Tamanna, Tamannah-Movie

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎఫ్3 సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు.ఈ సినిమాలో తమన్నా కొంత సమయం పాటు అబ్బాయిగా కనిపించగా ఆ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తమన్నా నటిస్తున్న పలు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.స్టార్ హీరోయిన్లు వరుసగా వివాహ బంధంలోకి ఎంటర్ అవుతుండటంతో ఆయా హీరోయిన్ల అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.తమన్నాకు పెళ్లి ఫిక్స్ అయితే చిరంజీవి సెంటిమెంట్ గురించి మరింత ఎక్కువగా వినిపించే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube