సాధారణంగా ఎక్కడైనా ఏళ్లనాటి అస్థిపంజరాలు బయట పడితే వాటికి సంబంధించి ఎముకలు మాత్రమే కనిపిస్తాయి.ఈజిప్టు మమ్మీలు బయటపడిన చోట అక్కడ ఖననం చేసే సమయంలో కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించడం ద్వారా శరీరంలో వెంట్రుకలు, ఎముకలు బయటపడడం విని ఉంటాం.
అయితే చిలీలోని ఎడారిలో బయటపడిన అస్థిపంజరం చూపి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఆ అస్థిపంజరానికి వెంట్రుకలతో పాటు పొడి చర్మం ఉండడంతో పరిశోధకులు అవాక్కవుతున్నారు.
అటకామా ఎడారి ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ పురాతన అస్థిపంజరం పరిశోధకులకు కనిపించింది.
చిలీలో దొరికిన ఈ అస్థిపంజరం క్రీ.పూ.5020 నాటిదని తెలుస్తోంది.అంటే ఏడు వేళ సంవత్సరాల నాటిదని తెలుసుకుని పరిశోధకులతో పాటు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది.అన్ని వేల ఏళ్ల నాటి అస్థిపంజరం అటువంటి పరిస్థితిలో దొరకడం అంటే మామూలు విషయం కాదు.
పైపెచ్చు ఆ అస్థిపంజరం పైన దుస్తులు కప్పి ఉన్నాయి.ఏ మాత్రం శిథిలమైన స్థితిలో కాకుండా చూడగానే ఇటీవల ఖననం చేసినట్లు అది కనిపిస్తోంది.
దీనిని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు.
అయితే నెటిజన్లు ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు.
అవి కల్పిత గాథలని కొందరు కొట్టిపారేస్తున్నారు.ఇన్ని వేళ ఏళ్ల పాటు శరీరంపై వెంట్రుకలు ఎలా ఉన్నాయని, చర్మం మిగిలి ఉండడం అసాధ్యమని వాదిస్తున్నారు.
ఇక దుస్తులు కూడా ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మిగిలిన వారు మాత్రం ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అదే కనుగ నిజమైతే ఈ అస్థిపంజరాన్ని బాగా పరిశోధించాలని కోరుతున్నారు.అన్ని వేల ఏళ్ల పాటు మృతదేహాన్ని పాడవకుండా కాపాడిన విధానాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.







