సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం జరుగుతూ ఉంటుంది.ప్రధాన పాత్రల విషయంలోనే కాదు సైడ్ క్యారెక్టర్స్ విషయంలో కూడా ఇలాంటివీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా లో కూడా ఇలాంటిది జరిగిందట.మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ఒక మంచి ఎంటర్టైనర్ గా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన చిత్రం శంకర్ దాదా ఎంబిబిఎస్.
ఎంతో వినోదభరితంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈ సినిమాలో శంకర్దాదా అనే పాత్రను దర్శకుడు మలచిన తీరు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫిదా అయిపోయారు.అయితే శంకర్ దాదా ఎం బి బి ఎస్ లో మెగాస్టార్ చిరంజీవి పాత్రతో పాటు ATM అనే ఒక పాత్ర కూడా బాగా హైలైట్ అయింది.
ఇక ఈ పాత్రలో మెగాస్టార్ చిరంజీవికి సొంత తమ్ముడు కాకపోయినా ఇక ప్రాణమిచ్చే తమ్ముడిగా శ్రీకాంత్ నటించాడు.

సినిమాలో ఈ పాత్ర ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఏటీఎం పాత్ర గురించి శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.
అయితే తొలుత ఏటీఎం క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తో చేయిద్దామని అనుకున్నారు చిరంజీవి.కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయి బిజీగా ఉన్నారు.
దీంతో డేట్స్ కుదరలేదు.దీంతో ఎవరి తో చేయించాలా చిరంజీవి ఆలోచనలో పడిన సందర్భంలో నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు ఈ పాత్ర చేస్తావా అని అడగడం.
ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అని నేను ఒప్పుకోవడం జరిగింది.ఇక మా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండడం వల్ల పాత్రలు కూడా బాగా పండాయ్ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.







