దత్తతలో ఆడపిల్లల సంఖ్యే ఎక్కువ.. తాజా గణాంకాల్లో ఆసక్తికర నిజాలు!

పిల్లలు లేని వారు లేదా అసహాయ స్థితిలో ఉన్న పిల్లలను పెంచాలనుకునే వారు సాధారణంగా దత్తత కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు.అయితే కరోనా వల్ల కొద్ది నెలల పాటు పిల్లల దత్తతలు గణనీయంగా తగ్గాయి.

 The Number Of Girls In Adoption Is High . Interesting Facts In The Latest Statis-TeluguStop.com

ఇప్పుడు చాలా వరకు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ దత్తతల సంఖ్య పెరిగింది.కేంద్రీయ దత్తత ఏజెన్సీ(కారా) తెలిపిన గణాంకాల ప్రకారం, గత ఏడాది అంటే 2021లో దంపతులు మొత్తం 116 మంది ఆడపిల్లలు, 53 మంది మగపిల్లలను దత్తత తీసుకున్నారు.

ఇది అధికారికంగా దత్తత తీసుకున్న లెక్క మాత్రమే!

అయితే మగపిల్లల కంటే ఆడ పిల్లలను ఎక్కువగా దత్తత తీసుకోవడం గమనార్హం.సాధారణంగా ఆడపిల్లలకు జన్మనిచ్చేందుకు మాతృమూర్తులు భయపడుతుంటారు.

ఎందుకంటే అత్తింటి వారి గృహహింస లేదా పేదరికం లేదా సామాజిక దురాచారం వంటి కారణాల వల్ల వారు తమ కన్న బిడ్డలను సరిగా పెంచలేరు.అందుకే ఆడపిల్లలను దత్తతకు ఇస్తుంటారు.

మరికొందరు రోడ్లపై వదిలేస్తుంటారు.ఇలాంటివారిని శిశు సంరక్షణ అధికారులు చేరదీస్తుంటారు.

ఈ అధికారులు అనాధ పిల్లలు, రోడ్లపై దొరికిన పిల్లలు, ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను శిశు సంరక్షణ గృహంలో అప్పజెప్తారు.ఇలాంటి పిల్లలను దత్తత తీసుకునేందుకు కారా నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.

పిల్లల శ్రేయస్సు నిమిత్తం కారా దత్తత తీసుకునే వారి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తుంది.వారు పిల్లలను మంచిగా చూసుకోగలరనే నమ్మకం వచ్చిన తర్వాతనే అధికారికంగా వారికి పిల్లలను అప్పజెబుతుంది.

Telugu Latest-Latest News - Telugu

అయితే మగపిల్లల సంఖ్య తక్కువగా ఉండటంతో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఐదేళ్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది.అదే ఆడ పిల్లల విషయానికొస్తే వారు రెండేళ్ల సమయంలోనే దత్తతకు వెళ్ళిపోతున్నారు.ఇది ఒక్కటే కారణం కాదు.ఆడపిల్లలకు తల్లిదండ్రులపై సహజంగా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పెంచిన తల్లిదండ్రులైనా సరే ఆడపిల్లలు స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు.అందుకే ఆడ పిల్లలను దత్తత తీసుకునేందుకే దంపతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు శిశు సంక్షేమ అధికారులు తెలిపారు.

విదేశాల్లో నివశించే దంపతులు కూడా ఇండియాలోని మగ ఆడ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube