ఈ హోటల్ మొత్తాన్ని ఉప్పుతోనే నిర్మించారట.. ఎక్కడంటే !

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి.కొన్ని సహజసిద్ధమైన వింతలైతే, మరికొన్ని మానవ నిర్మితమైన వింతలను చెప్పొచ్చు.

 The Entire Hotel Was Built With Salt Slat, Hotel, Viral News, Viral Latest, News-TeluguStop.com

వీటి గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.ఇప్పుడు మనం ఒక చిత్రవిచిత్రమైన మానవ నిర్మితం గురించి తెలుసుకుందాం.

దీనిని పూర్తిగా ఉప్పు తోనే నిర్మించారు.సాధారణంగా మట్టితో నిర్మిస్తేనే ఈ రోజుల్లో భవనాలు నిలవడం లేదు.

అలాంటిది ఒక పెద్ద హోటల్‌ను ఉప్పుతో బిల్డ్ చేశారు.అయితే ఉప్పు అన్న తర్వాత కరిగిపోదా అనే అనుమానం అందరికీ కలగకమానదు.

అలా జరగకుండా ఉండేందుకు హోటల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.

బొలీవియాలో ‘పాలాసియో డి సాల్‌‘ అనే హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టారు.అందరూ హోటల్‌కు ఫుడ్ తినడానికి వెళతారు కానీ ఈ హోటల్ కి మాత్రం చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పోటెత్తుతుంటారు.

ఈ హోటల్‌లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతో తయారు కావడం విశేషం.ఈ భవనంలో 12 గదులు, డైనింగ్‌ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.

దీనివల్ల ఇవన్నీ కూడా తెల్లగా మెరుస్తూ చూపరులను కట్టిపడేస్తాయి.

Telugu Hotel, Palacio De Sal, Slat, Latest-Latest News - Telugu

బొలీవియాలోని ఒక ఎడారిలో “సలార్‌ డి ఉయునీ” ఉప్పు దొరుకుతుంది.ఈ ఉప్పును చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.అయితే ఉప్పు ఎడారిని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ హోటల్ నిర్మించారట.

ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్‌గ్లాస్‌తో చాలా కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు.ఇందులోకి నీరు గాలి వంటివి చొరబడవు.

అందుకే నొప్పితో నిర్మితమైన ఈ హోటల్ చాలా దృఢంగా ఉంటుంది.ఏది ఏమైనా దీని గురించి తెలుసుకున్న ప్రజలందరూ నోరేళ్లబెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube