వెండితెరపైకి బాలీవుడ్ స్టార్స్ వారసులు ఎంట్రీ.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ గా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల పిల్లలు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంది.ఇప్పటికీ ఎంతమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకులుగా, హీరో హీరోయిన్ లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

 Paloma Dhillon Rajveer Deol Debut Rajshri Productions , Poonam Dhillon , Daughte-TeluguStop.com

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోను ఇప్పటికే సెలబ్రెటీల పిల్లలు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అలా టాలీవుడ్ తో బాలీవుడ్ లో కూడా చాలామంది సెలబ్రిటీల పిల్లలు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ అయినా అంతా బచ్చన్ మనవడు అగస్త్యా నంద సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అదే విధంగా దివంగత నటి శ్రీదేవి, దర్శకుడు బోని కపూర్ ల కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

షారుక్ ఖాన్ కుమార్తె అయిన సుహానా ఖాన్ ఇటీవల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.సుహానా ఖాన్ నటిస్తున్న తొలి వెబ్ సినిమా ద ఆర్చీస్.ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మరొక స్టార్‌ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెర పై ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్‌ డియోల్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కబోతోంది.

Telugu Agastya Nanda, Bollywood, Debut, Khushi Kapoor, Kollywood, Poonam Dhillon

ఇక ఇందులో హీరోయిన్‌ గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్‌, నిర్మాత అశోక్‌ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్‌ కూడా తెరంగేట్రం చేయనుంది.వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది.అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్‌ సూరజ్‌ బర్జాత్యా కుమారుడు అవినీష్‌ ఎస్‌ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

రాజశ్రీ ప్రొడక్షన్‌లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది.కాగా ఈ సినిమా మోడ్రన్‌ సంబంధాలను చూపిస్తూ లావిష్‌ డెస్టినేషన్‌ వర్క్ వెడ్డింగ్‌ కథతో రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube