యాదాద్రి జిల్లా:భువనగిరి ఎయిమ్స్ లో అడుగడుగునా నిర్లక్ష్యం,అలసత్వం కనిపిస్తున్నదని, ఎయిమ్స్ ను కేంద్రం గాలికి వదిలేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు.శుక్రవారం ఆయన బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించారు అనంతరం మీడియా తో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఎయిమ్స్ కి భూములు బదలాయింపు చేయలేదని పచ్చి అబద్ధాలు ఆడాడు.
తెలంగాణ ప్రభుత్వం కాగిలతో సహా రుజువులు చూపిస్తే కిషన్ రెడ్డి నాలుక కరుచుకున్నాడన్నారు.ఎయిమ్స్ లో సౌకర్యాలు లేక ఎమ్ బి.బి.ఎస్ విద్యార్థులు,పేషంట్స్ నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.ఇంత వరకు కొత్త భవనాల నిర్మాణానికి ఎయిమ్స్ అధికారులు ఎస్టిమేషన్ లు కూడా తయారు చేయలేక పోయారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎయిమ్స్ లో చదువుతున్న ఎమ్.బి.బి.ఎస్ విద్యార్థులకు భువనగిరి ఆసుపత్రిలో ప్రాక్టీసు చేసుకునేలా అవకాశం కల్పించామన్నారు.ఎయిమ్స్ తో పాటు మొదలైన సూర్యాపేట,సిద్దిపేట,ఇతర మెడికల్ కాలేజీల భవనాలు నిర్యాణం పూర్తి కావొచ్చాయన్నారు.
కానీ,ఎయిమ్స్ లో మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాల్సిన ఎయిమ్స్ నిధులు లేక సౌకర్యాలు లేక చతికిల పడిందని,ఇది సరైంది కాదన్నారు.
ఇక్కడి విషయాలన్నింటిని కేంద్రంకి నివేదిస్తామని,ఉత్తరం కూడా రాస్తామని,స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం గతంలోని నిమ్స్ లో అందించిన ఓపీ సేవలే ఇప్పటికి ఎయిమ్స్ లో అందుతున్నాయని ఇది దుర్మార్గమన్నారు.
ఇప్పటికీ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదని,ఆపరేషన్ థియెటర్స్ అందుబాటులోకి రాలేదని,ఒక్క ఆపరేషన్ కూడా కాలేదని,కావాల్సినంత రిక్రూట్మెంట్ కూడా చేయలేదని,డాక్టర్ పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయన్నారు.నర్స్ పోస్టులు 812 నింపాల్సి ఉండగా ఇప్పటివరకు 200 మాత్రమే నింపారని,ఒక పీహెచ్సీ కేంద్రంలో అందిస్తున్న విధంగా ఓపీ సేవలను అందిస్తున్నారని ఇది అత్యంత దారుణమన్నారు.
ఇప్పటివరకు మూడేళ్లు అయినా తట్టెడు మట్టి తియ్యలేదని,ఇంత దారుణమా,ఇంత అలసత్వమా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి బాధ్యత లేదా,కేంద్రం స్పందించాలన్నారు.ఎయిమ్స్ లో సకల సదుపాయాలు కల్పించాలని,అన్ని రకాల వైద్యాన్ని అందించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.