డాక్టర్లకు శుభవార్త అందించింది మ్యాన్‌కైండ్ ఫార్మా.అవును.
ఇండియాలో టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి మ్యాన్‌కైండ్ తాజాగా OTT విభాగంలోకి ప్రవేశించింది.ఈ కంపెనీ డాక్టర్ల కోసం ప్రత్యేకంగా డాక్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.
తెలిసిన వివరాల ప్రకారం, డాక్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో వివిధ రకాల సబ్జెక్టులపై 20 డిఫరెంట్ షోలు ఉంటాయి.ఇందులో సైన్స్ సింప్లిఫైడ్, స్టిచ్ ఇన్ టైమ్, కార్డియో అన్‌ఫ్లిప్, లెజెండ్ ఇన్‌సైడ్ ద వైట్ కోట్, డిజిటల్ ఫర్ డాక్టర్స్, మెడికో లీగల్ కేసెస్ ఇన్ ఇండియా, వాన్టేజ్ పాయింట్ వంటి షోలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ తరహాలోనే డాక్‌ఫ్లిక్స్‌లో కూడా చాలా వీడియో కంటెంట్ ఉంటుందని కంపెనీ తెలపడం గమనార్హం.
దేశంలోని వైద్యుల వివిధ అభ్యాస అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సైంటిఫిక్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విభిన్న విషయాలపై కంటెంట్ ఉంటుందని, అది ఆరోగ్య నిపుణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మ్యాన్‌కైండ్ ఫార్మా పేర్కొంది.వైద్యులు రూపొందించిన సైంటిఫిక్ కంటెంట్‌ను చిన్న వీడియో ఫార్మాట్‌లలో అందించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.
రొటీన్ కంటెంట్‌ని అందించడానికి డాక్టర్లకు అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయని, అందుకే మారుతున్న కాలాలకు అనుగుణంగా వారికి ఉపయోగపడే కంటెంట్ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపింది.

వైద్యులు, రోగుల నిష్పత్తిలో ఉన్న భారీ అంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మన దేశంలో వైద్యులకు చాలా పరిమిత సమయం ఉంది.ఈ తక్కువ సమయంలో క్వాలిటీ కంటెంట్ అందించేందుకే డాక్‌ఫ్లిక్స్ తీసుకొచ్చాం, అని అన్నారు.“డిజిటల్ HCP ఎంగేజ్‌మెంట్ స్పేస్‌లో మా డాక్‌ఫ్లిక్స్ లాంచ్‌ను ప్రకటించినందుకు మేం చాలా ఆనందపడుతున్నాం.డిజైన్, కథనం, సౌలభ్యం అనేవి ఈ ప్లాట్‌ఫామ్ 3 బలమైన స్తంభాలు.ఇవి ప్రత్యేకమైన, ప్రామాణికమైన, విశ్వసనీయమైన సైంటిఫిక్ కంటెంట్‌ను అందజేస్తాయి.” అని మ్యాన్‌కైండ్ ఫార్మా సీనియర్ ప్రెసిడెంట్ ఇండియా బిజినెస్, డాక్టర్ సంజయ్ కౌల్ లాంచ్ సందర్భంగా పేర్కొన్నారు.







