ప్రస్తుతం టీడీపీ ని బాగా యాక్టిివ్ చేసే పనిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిమగ్నం అయ్యారు.ప్రస్తుతం ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచే విధంగా బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బాబు ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనే విషయాన్ని పక్కన పెడితే, నిత్యం జనాల్లో ఉండే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు మాత్రం బాబు పర్యటనలో బాగా ఉపయోగపడుతున్నాయి.ఈ వ్యవహారం ఇలా ఉంటే … వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
త్వరలోనే ఎన్నికలు రాబోతూ ఉండడంతో పార్టీ కేడర్ ను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే వైసిపి సైతం గడపగడపకు ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళ్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే విధంగా చేయడంతో పాటు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయి.
ఏ కుటుంబం ఎంత మేరకు లబ్ధి పొందింది అనే వివరాలను లెక్కలతో సహా జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా ,, సాధారణ ఎన్నికలు వచ్చినా వైసీపీ కి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేవు.కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త అలర్ట్ అవ్వాల్సిందే.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందింది.టిడిపి ఆవిర్భావం తర్వాత ఎప్పుడు చవిచూడని ఓటమిని చూసింది.కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.పార్టీ అధిష్టానం సూచించిన నిరసన కార్యక్రమాలు చేపట్టే విషయంలో నాయకత్వం వహించేందుకు నియోజకవర్గాల్లో పెద్దగా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే తమ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకు అన్న భావనలో చాలా మంది పార్టీ నాయకులు ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, 175 నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున బలమైన అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు.
చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు లేరు.దాదాపు 100 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది.

దీంతో ఈ మూడేళ్లుగా ప్రభుత్వం నిరసన కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఈ నియోజకవర్గాల్లో జరిగాయి.ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో విషయమై చంద్రబాబు దృష్టి సారించారు.ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచే ఎంపిక చేసుకుని వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి ప్రభుత్వం నిరసన కార్యక్రమాలు చేపడుతూ, జనం లోకి వెళ్లే విధంగా చేయగలిగితేనే తెలుగుదేశం పార్టీ ఆశించినట్లుగా అధికారం దక్కేందుకు అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
.






