ఈ ఫోటోగ్రాఫర్ పేరు ఎసరా ఇస్మాయిల్, ఎసరా ఈజిప్ట్ నివాసి.ఎసరా అంధురాలు.మంచి ఫోటోగ్రాఫర్.ఇది ఎలా సాధ్యమయ్యిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఫోటోగ్రఫీకి లైట్, యాంగిల్, కెమెరా సెట్టింగ్స్ ఇలా చాలా అంశాలను కంటితో చూడాలి.అయితే ఎసరా ఈ సాంకేతిక విషయాలను మించి తన ఫోటోగ్రఫీని కొనసాగించడం విశేషం.ఎసరా చూడలేరు.
కానీ కెమెరాపై కమాండ్‌తో అద్భుతమైన ఫోటోలను క్లిక్ మనిపిస్తారు.ఎసరా ఇప్పుడు అంధ ఫోటోగ్రాఫర్‌గా పేరొందారు.
ఈజిప్టులో ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అంధఫొటోగ్రాఫర్ గా పేరొందారు.ఆమె ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం.
కానీ చూడకుండా ఫోటోగ్రఫీ చేయడం కష్టమైనా ఈ పనిని సులభతరం చేసింది.ఎసరాకు ప్రస్తుతం 22 సంవత్సరాలు.
అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో అరబిక్ భాషా విభాగం నుంచి విద్యను అభ్యసించారు ఈ సమయంలో ఆమెకు ఫోటోగ్రఫీపై ఇష్టం ఏర్పడింది.తన కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
ఇందుకోసం ముందుగా ఫొటోగ్రఫీలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నారు.దీని తర్వాత ఏదైనా వస్తువు ఫోటోను సులభంగా క్లిక్ చేసే విధంగా తన ఊహాశక్తిని పెంచుకున్నారు.
ఎసరా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఫోటోలు క్లిక్ మనిపిస్తారు.ధ్వని విని, అతను కెమెరా యాంగిల్‌ను సెట్ చేస్తారు.
దీని తర్వాత, ఆ వ్యక్తి నుండి రెండు మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత, ఫోటో తీయడం ప్రారంభించి, ఆటోమోడ్ ద్వారా ఫోటోను క్లిక్ మనిపిస్తారు.ఇంతకుముందు, ఈ పనిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు.
ఫోటో నాణ్యత కూడా బాగుండేది కాదు.అయితే హార్డ్ వర్క్, నిరంతర సాధన కలగలిపి ఆమెను నిపుణురాలిగా తీర్చిదిద్దాయి.