రేపు ఉమ్మడి నల్లగొండకు వస్తున్న జనసేనాని

నల్లగొండ జిల్లా:ఈ నెల 20న ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్,కోదాడలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.ఈ మధ్య కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పవన్ పరామర్శించి,వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందచేస్తారని తెలుస్తోంది.20వ తేదీ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి బయలుదేరతారు.మెట్టుగూడ అంటేడ్కర్ చౌరస్తా,ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు.అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్పిస్తారు.ఆ తరవాత కోదాడకు వెళ్లి అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్పిస్తారని సమాచారం.జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

 Janasena Coming To The Joint Nallagonda Tomorrow-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube