చరణ్ - శంకర్ సినిమాపై క్రేజీ రూమర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే రాబోతుందట..

టాలీవుడ్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన నటించిన రెండు సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అయ్యాయి.

 Interesting Update On Ram Charan And Shankars Film Details, Shankar, Ramcharan,-TeluguStop.com

ఒకటి భారీ హిట్ అవ్వగా.మరొకటి మాత్రం భారీ ప్లాప్ అయ్యింది.

ట్రిపుల్ ఆర్ సినిమా ఈయనకు పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఇటీవలే రిలీజ్ అయినా ఆచార్య మాత్రం మెగా హీరోల కెరియర్ లోనే భారీ ప్లాప్ గా మిగిలి పోయింది.

అయితే చరణ్ మాత్రం హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన ఒప్పుకున్న సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.ప్రెసెంట్ ఈయన ఆర్సీ 15 షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.

ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.

ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా యమ స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

Telugu Acharya, Dil Raju, Shankar, Kiara, Ramcharan, Rc, Rc Poster-Movie

ఇప్పుడు వైజాగ్ లో ఆర్కే బీచ్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.దీని ప్రకారం ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని శంకర్ ఆగస్టు లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఇందులో ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగష్టు 15న రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube