భారతదేశం అనేక దశాబ్దాలుగా ప్రపంచంలోని అతిపెద్ద డిమాండ్-ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది.ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సిమెంట్ మార్కెట్‌గా భారత్ కొనసాగుతోంది.
ఈ తరుణంలో భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీ సిమెంట్ రంగంలోకి కూడా ప్రవేశించారు.అంబుజా సిమెంట్స్‌లో స్విస్ సిమెంట్ మేజర్ హోల్సిమ్ వాటాను, దాని అనుబంధ సంస్థ ఏసీసీని ఓపెన్ ఆఫర్‌లతో సహా $10.5 బిలియన్లకు (సుమారు రూ.81,361 కోట్లు) కొనుగోలు చేసే రేసులో గెలిచారు.
అదానీ కుటుంబం, ఆఫ్‌షోర్ స్పెషల్-పర్పస్ వాహనం ద్వారా, భారతదేశంలోని రెండు ప్రముఖ సిమెంట్ కంపెనీలలో వాటా కొనుగోలు చేసింది.అంబుజా సిమెంట్స్, ఏసీసీలో హోల్సిమ్ లిమిటెడ్ మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి ఖచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
సిమెంట్ పరిశ్రమలోకి ప్రవేశించే క్రమంలో అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యు గ్రూప్‌లను మించిపోయింది.ఏటా 70 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా కూడా అవతరించింది.అంబుజా సిమెంట్‌లో హోల్సిమ్‌కు 63.19 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటా ఉంది.అంబుజా సిమెంట్, ఏసీసీలో 50.05 శాతం కలిగి ఉంది.మార్కెట్ రెగ్యులేటర్, సెబీ నిబంధనల ప్రకారం, అదానీ కుటుంబం ఈ రెండు కంపెనీల్లో 26 శాతాన్ని ప్రమోటర్ కాని వాటాదారుల నుండి కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ చేస్తుంది.
అదానీ గ్రూప్ ఇప్పటికే పోర్ట్‌లు, లాజిస్టిక్స్ వ్యాపారం, ఇంధన వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేస్తోంది.తాజా వ్యాపారంతో మార్కెట్‌లో ఓ పెద్ద వ్యాపారాన్ని చేజిక్కించుకుంది.

భారతదేశం అంతటా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 50 వేల కంటే ఎక్కువ ఛానెల్ భాగస్వాములు అంబుజా, ఏసీసీ సిమెంట్స్ సంస్థలు కలిగి ఉన్నాయి.అంబుజా, ఏసీసీ రెండూ సమీకృత అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్‌తో సినర్జీల నుండి ప్రయోజనం పొందుతాయి.ముఖ్యంగా ముడిసరుకు, పునరుత్పాదక శక్తి, లాజిస్టిక్స్ రంగాలలో, అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీలు విస్తారమైన అనుభవం, లోతైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి.ఇది రెండు కంపెనీలకు అధిక మార్జిన్‌లను, పెట్టుబడిపై రాబడిని అందిస్తుంది.







