పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహించబడుతున్న ప్రసిద్ధ గిరిజన ఉత్సవం శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.
రోజా.
పాడేరులో నిర్వహించబడుతున్న ప్రసిద్ధ గిరిజన ఉత్సవం, ప్రధానంగా ఆదివాసీ గిరిజన దేవత మోదకొండమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖ సంతోషాలతో వుండాలి.
ఆలయానికి మరియు దేవతకు ముఖ్యమైన చరిత్ర ఉందనీ, మరియు గిరిజన, గిరిజనేతర వర్గాలచే పూజించబడుతున్న ఏజెన్సీ ప్రాంతంలో శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుందనీ, గిరిజనుల అన్ని భక్తి మరియు సాంప్రదాయ ఆచారాలతో 3 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారనీ తెలిపారు.