మహేష్ డ్యాన్స్ పై థమన్ కామెంట్స్.. ఇది షాక్ లో వచ్చిన షేక్ అట..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన ఫాలోయిన్ నే వేరు.

 Thaman About Mahesh Babu Dance On Stage , Ss Thaman , Thaman Comment , Mahesh B-TeluguStop.com

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.

ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.ఇక సర్కారు కూడా ఇలానే ఆకట్టు కుంటుంది.

థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కలెక్షన్స్ కూడా అదరగొడుతూ ముందుకు వెళుతున్నాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు ఈ సినిమాలో మరింత అందంగా కనిపించి అమ్మాయిల మనసు దోచేశాడు.

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సర్కారు వారి పాట సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసింది.

ఈ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ ఈవెంట్ లో చాలా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం జరగలేదు.కానీ ఫర్ ది ఫస్ట్ టైం నిన్న ఈవెంట్ లో స్టేజ్ మీద మ మ మహేశా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

దీంతో స్టేజ్ మీద ఉన్న థమన్ కూడా మహేష్ తో కలిసి స్టెప్పులు వేసి తన సంతోషం తెలిపారు.

Telugu Parasuram, Keerthy Suresh, Mahesh Babu, Sarkaruvaari, Ss Thaman, Thaman,

ఈ డ్యాన్స్ పై సోషల్ మీడియా ద్వారా థమన్ కామెంట్స్ చేసారు.వాటే మూమెంట్ లైఫ్ కి ఇంకా అదే షాక్ లో ఉన్నాను నేను.షాక్ లో వచ్చిన షేక్ అంటూ థమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ కామెంట్స్ తో పాటు మహేష్ తో కలిసి స్టెప్పులు వేస్తున్న ఫోటోను షేర్ చేసాడు.ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ డ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube