బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.గత వారం ఎలిమినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటూ పెద్దఎత్తున చర్చలు మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సైతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోని బిగ్ బాస్ హౌస్ లో ఆడపులిగా దూసుకుపోతున్న బిందుమాధవికి మొదటి నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇప్పటికే కొందరు బిందు మాధవి టైటిల్ గెలుస్తుంది అంటూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు.
అదేవిధంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన మద్దతు బిందుమాధవికి తెలియజేశారు.ఈ విధంగా రోజురోజుకు బిందు మాధవికి విపరీతమైన మద్దతు లభించడంతో ఈమె టైటిల్ రేసులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరో సపోర్ట్ కూడా బిందు మాధవికి లభించింది.

కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ బిందు మాధవికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు.బిందు మాధవి ఇలా ఫైనల్ వరకు చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఖచ్చితంగా బిందుమాధవి విన్నర్ అవుతారంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ.
గో గెట్ ఇట్ చాంపియన్ అని ట్వీట్ చేశాడు.ఈ విధంగా బింధుమాధవికి రోజురోజుకు వారి మద్దతు లభించడంతో చాలామంది ఈమె టైటిల్ విన్నర్ అవుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు
.






