కాంగ్రెస్ లో సునీల్ నివేదిక కలకలం ?

కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తీవ్రతరం కావడం పై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.

ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన సమావేశంలోనూ ఈ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి ఏమాత్రం మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు.ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో తలనొప్పులు తీసుకువచ్చే సీనియర్ నాయకుల వ్యవహార శైలి కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది.

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు అందరితోనూ అనేక అంశాలపై చర్చించారు.గ్రూపు రాజకీయాలు వదిలిపెట్టి కాంగ్రెస్ విజయానికి అంతా కృషి చేయాలని కోరారు.

Advertisement

ఆ సమయంలో పార్టీ నాయకులు ఏకభిప్రాయంతో ఉన్నట్టు గా కనిపించారు.ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు కీలక నివేదికను అధిష్టానానికి , కాంగ్రెస్ కూడా అందించినట్లు సమాచారం.

దీంతో కాంగ్రెస్ లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు అనే విషయం పై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.పైకి కలిసి కట్టుగానే ఉన్నట్లగా వ్యవహరిస్తున్,న లోలోపల మాత్రం గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విషయం సునీల్ నివేదికలో బయటపడడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇక జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సునీల్ నివేదికను అందించారు.ఇందులో పార్టీ నాయకులు అందరి వ్యవహారాలను ఆయన పొందుపరచడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవలే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో సునీల్ బృందం ఈ అంశాలనే పైన నివేదిక అందించినట్లు తెలుస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఈ నివేదికలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఉన్నా, దాన్ని అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారని, దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు అంటూ ఆయన నివేదిక అందించడం కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తున్నాయి.ఇదే విధంగా ఎన్నికల వరకు నాయకులు వ్యవహరిస్తే కాంగ్రెస్ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు