సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయినప్పటి నుంచి నెటిజన్లు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు.ఇక సెలెబ్రేటీలు సైతం సోషల్ మీడియాకు బాగా అలవాటు పడుతున్నారు.
ఇక మీమర్స్ మాత్రం తెగ మీమ్స్ తో సందడి చేస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలతో బాగా ఆడుకుంటున్నారు అని చెప్పవచ్చు.
ఏదైనా సినిమాలో నటీనటులకు సంబంధించిన సీరియస్ సన్నివేశాలు ఉంటే వెంటనే వాటికి మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట్లో తెగ వైరల్ గా మారుస్తున్నారు.అంతేకాకుండా డైలాగ్స్ ను కూడా ఫన్నీ గా క్రియేట్ చేసి బాగా ఎడిట్ చేస్తుంటారు.
ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్ చేశారు.స్టార్ హీరోలను కూడా అసలు వదలట్లేరు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.సమంత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు ‘ఖుషి’ అని టైటిల్ ప్రకటించగా ప్రస్తుతం ఈ టైటిల్ పై ట్రోల్లర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సినిమా ఖుషి.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ నే సమంత, విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు సినిమా పేర్లు ఇతర హీరోలు వాడుకున్న సంగతి తెలిసిందే.
దీంతో తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా పేరు వాడుకోవడంతో.పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీల్ అవుతూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
మా సినిమా టైటిల్ లాక్కున్నారు అంటూ ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.ఆయనకు నెగిటివ్ కామెంట్లు వస్తే అసలు ఊరుకోరు.ఇక ఆయనకు సంబంధించిన ఏ విషయంలో అయినా బాగా జాగ్రత్తగా ఉంటారు.
అలాంటిది ఇప్పుడు ఆయన సినిమా పేరును కాపీ చేయడంతో ఆయన అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.
ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.మరి ఈ కామెంట్ల గురించి ప్రస్తుతం ఖుషి పేరు తో తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఏమని స్పందిస్తాడో చూడాలి.
ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగా వాదనలు చేస్తే ఈ సినిమా టైటిల్ ను మారుస్తారో లేదో చూడాలి.







