లోకేష్, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి బాబు పై జగన్ విమర్శలు..!!

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రత్యర్థులపై భారీ డైలాగులు వేశారు.ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక పోతున్నాయని అన్నారు.

 Ap Cm Jagan Serious Comments On Chandrababu Pawan Kalyan, Chandrababu, Lokesh, Y-TeluguStop.com

దుష్టచతుష్టయం అంటూ దేవుడే వాళ్లకి వైద్యం చేస్తాడు అంటూ జగన్ విమర్శించారు.ఏ రాజకీయ నాయకుడు అయిన ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతారు.

కానీ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడునీ… రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దత్తపుత్రుడిని నమ్ముకుని ముందుకు వెళుతున్నారని సెటైర్లు వేశారు.

పాదయాత్ర చేస్తున్న సమయంలో మత్స్యకారుల సమస్యలు నేను తెలుసుకున్నాను.ఈ క్రమంలో మన ప్రభుత్వం మత్స్యకారులకు చేసిన మంచి పనులు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు తన పరిపాలన మొత్తంగా మత్స్యకారులకు 104 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి మత్స్యకారులకు 109 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు లెక్కలు తెలియజేశారు.

దాదాపు లక్షా 40 వేల కోట్లకు పైగా రాష్ట్రంలో ఉన్న పేదలకు వైసీపీ ప్రభుత్వం మంచి పనులు చేయడం జరిగిందని తెలిపారు.

Telugu Chandrababu, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

పేదలకు మంచి చేస్తుంటే టీడీపీ దాని అనుబంధ మీడియా సంస్థలు భరించలేకపోతున్నాయి.27 సంవత్సరాలు కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు.ఇంతవరకు సొంత ఇల్లు నియోజకవర్గంలో కట్టుకోలేదు.

అయితే రాష్ట్రంలో జగన్ పరిపాలన చూసి దెబ్బకి …కుప్పంలో ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.గత ప్రభుత్వానికి… మన ప్రభుత్వానికి తేడా ప్రజలే గమనించాలి అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube