పెదాలు అందంగా, కోమలంగా ఉండాలని కోరుకోని వారు ఉండరు.కానీ, వాతావరణంలో వచ్చే మార్పులు, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, శరీరంలో అధిక వేడి వంటి రకరకాల కారణాల వల్ల కొందరి పెదాలు తరచూ పగిలిపోతుంటాయి.
దాంతో పగిలిన పెదాలను మళ్లీ అందంగా, మృదువుగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అందుకు అనాస పండు గ్రేట్ గా సహాయపడుతుంది.
అనాస పండునే పైనాపిల్ అని పిలుస్తారు.చక్కటి రుచిని కలిగి ఉండే అనాస పండులో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే చాలా మంది అనాస పండును ఇష్టంగా తింటుంటారు.కొందరు జ్యూస్ రూపంలోనూ తీసుకుంటారు.అయితే అనాస పండు ఆరోగ్యానికే కాదు సౌందర్య పరంగా కూడా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పగిలిన పెదాలను అనాస పండును అందంగా మార్చుకోవచ్చు.
అందుకోసం తొక్క చెక్కేసిన అనాస పండు ముక్కలను కొన్నిటిని తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పెదాలకు రోజులో రెండు, మూడు సార్లు మరియు నిద్రించే ముందు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండాలి.ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోయి పెదాలు అందంగా, కోమలంగా మారతాయి.
ఇక అనాస పండు పగిలిన పెదాలనే కాదు పొడిబారిన చర్మాన్ని సైతం రిపేర్ చేయగలదు.అందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని పైనాపిల్ ముక్కలు, అర కప్పు పాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక ఎగ్ వైట్ వేసి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుని బ్రెష్ సాయంతో ముఖానికి పట్టించాలి.ఇరవై నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇలా చేస్తే ముఖం తేమగా, గ్లోయింగ్‌గా మారుతుంది.